📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Polavaram : నేర పరిశోధనలో శాస్త్రీయ పద్ధతులపై పోలీసు సిబ్బందికి శిక్షణ


ఏలూరు జిల్లా :పోలవరం : స్వచ్ఛవార్త :

కార్మిల్‌పురం సెయింట్ ఫ్రాన్సిస్ పాఠశాల మైదానంలో శుక్రవారం పోలవరం సర్కిల్ పోలీసు సిబ్బందికి ప్రత్యేక పరేడ్‌తో పాటు నేర పరిశోధనపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు, పోలవరం డీఎస్పీ కె. జయకృష్ణ పర్యవేక్షణలో పోలవరం ఎస్సై పి. అప్పారావు, కొయ్యలగూడెం ఎస్సై వి. చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

నేరస్థల పరిశీలనపై శిక్షణ :

నేరస్థలాన్ని శాస్త్రీయ పద్ధతిలో పరిశీలించడం, సంఘటనా స్థలంలో ఫొటోలు తీయడం, భౌతిక సాక్ష్యాలను సేకరించి భద్రపరచడం, రఫ్ స్కెచ్ రూపొందించడం, సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేయడం తదితర అంశాలపై పోలీసులకు శిక్షణ ఇచ్చారు. కోర్టులో సాక్ష్యాలు నిలిచే విధంగా ప్రతి ఆధారాన్ని పకడ్బందీగా సేకరించి భద్రపరచాలని సూచించారు.

క్రమశిక్షణతో విధులు నిర్వహించాలి : 

పోలీసులు సమయపాలన, క్రమశిక్షణ పాటిస్తూ ప్రజలకు మరింత చేరువగా పనిచేయాలని డీఎస్పీ కె. జయకృష్ణ సూచించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని నేరాల దర్యాప్తు నాణ్యతను మరింత పెంచుకోవాలని తెలిపారు.

కార్యక్రమంలో ఎస్సైలు పి. అప్పారావు, వి. చంద్రశేఖర్‌తో పాటు పోలవరం సర్కిల్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం