Polavaram : విద్యుత్ఘాతంతో ఆశ్రమ పాఠశాల విద్యార్ధిని మృతి.. హాస్టల్ వార్డెన్, హెచ్ ఏం సస్పెన్షన్
పోలవరం జిల్లా : పోలవరం : స్వచ్ఛవార్త :
మండలంలోని శివకాశిపురం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఓ గిరిజన విద్యార్థిని విద్యుత్ఘాతానికి గురై మృతి చెందిన సంఘటన మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఈ ఘటనకు కారణంగా భావించి హాస్టల్ వార్డెన్, పాఠశాల హెచ్ ఏం లను ఐటిడిఏ పీఓ రాములు నాయక్, డిడి జగన్నాథ రావు లు సస్పెండ్ చేశారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వపరంగా అన్ని విధాల ఆదుకుంటామన్నారు.
మండలంలోని చిట్టంరెడ్డిపాలెం గ్రామానికి చెందిన కెచ్చేల లక్ష్మీ పార్వతి (13) శివకాశిపురం ఆశ్రమ పాఠశాలలో 8వతరగతి విద్యనభ్యసిస్తోంది. శుక్రవారం ఉదయం 6 గంటల సమయంలో కిటికీ పై బట్టలు తీసుకునే క్రమంలో ప్రమాదవశాత్తు కిటికీ వద్ద ఉన్న కరెంట్ వైరుకు ఆమె చేయి తగిలి విద్యుత్ఘాతానికి గురైంది.హాస్టల్ వార్డెన్,సిబ్బంది సహాయంతో వెంటనే లక్ష్మీపార్వతినీ ప్రభుత్వ వైద్యశాల కు తరలించగా అప్పటికే విద్యార్ధినీ ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు నిర్ధారించారు.సమాచారం తెలుసుకున్న తల్లి దండ్రులు ,ఆదివాసీ సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు ఆశ్రమ పాఠశాల వద్దకు చేరుకుని మృతదేహంతో ధర్నా చేపట్టారు.
వార్డెన్ నిర్లక్ష్యం వలనే తమ కుమార్తె మృతి చెందిందని తగిన న్యాయం చేయాలని నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న ఐటిడిఏ పీఓ రాములు నాయక్ ,డిడి జగన్నాథ రావు ఆశ్రమ పాఠశాలకు చేరుకుని విద్యార్థిని కుటుంబానికి 50 వేల నగదు తక్షణ సహాయం చేశారు.50 లక్షలు ఎక్స్గ్రేషియా ,ఉద్యోగం ఇవ్వాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేయడం తో జిల్లా అధికారుల దృష్టికి విషయం తెలియపరచి, తగిన న్యాయం చేస్తామని ప్రకటించడంతో ఆందోళన కారులు మృత దేహాన్ని తీసుకుని దహన సంస్కారాలకు సిద్ధ మయ్యారు. సీఐ బాల సురేష్ బాబు,యస్ ఐ నవీన్ కుమార్,సిబ్బంది ఆశ్రమ పాఠశాల వద్ద ఎలాంటి అవాంఛ నీయ ఘటనలు జరగ కుండా బందోబస్తు నిర్వహించారు.

