📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

T. Narasapuram : పోక్సో కేసులో నిందితుడికి ఏడాది జైలు.. రూ. 500 జరిమానా

ఏలూరు జిల్లా : టి నరసాపురం : స్వచ్ఛవార్త :

ఏలూరు జిల్లా టి.నరసాపురం మండలంలో చోటుచేసుకున్న పోక్సో కేసులో నిందితుడికి శిక్ష ఖరారైంది. 2021 జూన్ 25న గౌరిశంకరపురం గ్రామంలో ఒక చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటనపై బాధిత బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు టి.నరసాపురం పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 288/2021గా కేసు నమోదైంది.

కేసు నమోదు చేసిన అనంతరం పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టి సాక్షులను విచారించడంతో పాటు బాలిక వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. వైద్యపరమైన, ఇతర కీలక ఆధారాలను సేకరించి గౌరవ న్యాయస్థానంలో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. జువైనైల్ జస్టిస్ బోర్డ్ కమ్ రెండవ అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు, ఏలూరులో  జె సి సి  నంబర్.60/2021గా విచారణ పూర్తయిన అనంతరం శుక్రవారం స్పెషల్ పోక్సో కోర్టు తీర్పు వెలువరించింది.

నేరం రుజువు కావడంతో గౌరిశంకరపురం గ్రామానికి చెందిన నిందితుడును దోషిగా నిర్ధారిస్తూ కోర్టు ఒక సంవత్సరం జైలు శిక్షతో పాటు రూ.500 జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ఈ కేసులో నిందితుడికి శిక్ష పడేలా దర్యాప్తును సమర్థవంతంగా నిర్వహించిన టి.నరసాపురం సబ్‌-ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎం. జయబాబు, హెడ్ కానిస్టేబుల్ ( హెచ్. సి -1635) ఎం. జయరాజు, ఇతర పోలీసు సిబ్బందిని పోలీస్ శాఖ ప్రత్యేకంగా అభినందించింది.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం