T. Narasapuram : ప్రపంచ తల్లిపాల వారోత్సవంపై అవగాహన కార్యక్రమం
ఏలూరు జిల్లా : టి. నరసాపురం : స్వచ్ఛవార్త :
స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా. పుల్లయ్య శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందిస్తున్న వైద్య సేవలు, రికార్డుల నిర్వహణ, ఇ. ఏచ్.ఆర్ ప్రయోగశాల సేవలు, మాతా శిశు ఆరోగ్య సేవలు, టీకా కార్యక్రమాలు మరియు సంస్థాగత ప్రసవాలపై సమీక్ష నిర్వహించారు.
అనంతరం ఆగస్టు 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు నిర్వహిస్తున్న ప్రపంచ తల్లిపాల వారోత్సవం సందర్భంగా చేపడుతున్న కార్యక్రమాలపై ఆయన సమీక్షించారు. తల్లిపాల ప్రాముఖ్యత, శిశువుకు పుట్టిన వెంటనే తల్లిపాలు అందించడం, మొదటి ఆరు నెలల పాటు శిశువుకు కేవలం తల్లిపాలనే అందించడం వంటి అంశాలపై తల్లులు మరియు గర్భిణీ స్త్రీలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు.
ప్రపంచ తల్లిపాల వారోత్సవం సందర్భంగా ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది సమన్వయంతో గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, తల్లిపాల వల్ల తల్లికి మరియు శిశువుకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని సూచించారు.
ఈ సందర్భంగా వైద్యాధికారి పుల్లయ్య మాట్లాడుతూ..
శిశువుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు తల్లిపాలు ఎంతో కీలకమని, ప్రతి తల్లికి తల్లిపాలపై సరైన అవగాహన కల్పించడం ఆరోగ్య శాఖ బాధ్యత అని తెలిపారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవం సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించి, ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు.
కార్యక్రమంలో వైద్యాధికారి, వైద్య సిబ్బంది, హెల్త్ అసిస్టెంట్ లు ఏ.ఎన్.ఎమ్ లు ఆశా కార్యకర్తలు మరియు ఇతర ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

