📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Tadepalligudem : స్వచ్ఛమైన ఆంధ్రప్రదేశ్‌తోనే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ సాధ్యం : మున్సిపల్ కమిషనర్ యేసుబాబు

పశ్చిమగోదావరి :తాడేపల్లిగూడెం : స్వచ్ఛవార్త :

స్వచ్ఛమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణంతోనే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ సాధ్యమవుతుందని తాడేపల్లిగూడెం పురపాలక సంఘం కమిషనర్ ఎం. యేసుబాబు అన్నారు. ప్రతి నెల మూడో శనివారం నిర్వహించే స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర (SASA) కార్యక్రమంలో భాగంగా శనివారం పట్టణంలో ప్రత్యేక పారిశుధ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

కమిషనర్ ఎం. యేసుబాబు ఆధ్వర్యంలో పురపాలక, సచివాలయ సిబ్బందితో కలిసి పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్వచ్ఛత, పారిశుధ్య పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ కొనసాగింది. అనంతరం సిబ్బందితో స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు.

ప్రతి పౌరుడు భాగస్వామి కావాలి :

ఈ సందర్భంగా కమిషనర్ యేసుబాబు మాట్లాడుతూ.. పట్టణ పరిశుభ్రత కేవలం పురపాలక సిబ్బంది బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడు బాధ్యతగా భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లు, పరిసరాలు, వీధులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛత కార్యక్రమాలు మరింత విజయవంతమవుతాయని ఆయన పేర్కొన్నారు.

కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ డి. భవానీ బాబు, మున్సిపల్ ఇంజనీర్ వై. వెంకట రమణ, రెవెన్యూ ఆఫీసర్ పి. ప్రసాద్‌తో పాటు పురపాలక అధికారులు, సిబ్బంది, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం