Tirumala : శ్రీవారి దర్శనానికి కాలినడకన కోళ్ల నాగేశ్వరరావు(KNR)
తిరుపతి/ భీమవరం : స్వచ్ఛవార్త :
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు (కేఎన్‌ఆర్) శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం బుధవారం తెల్లవారుజామున తిరుపతి అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు బయలుదేరారు. అలిపిరి పాదాల మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, శ్రీవారి నామస్మరణతో మెట్ల మార్గంలో తన పాదయాత్రను ప్రారంభించారు.
ఈ సందర్భంగా కోళ్ల నాగేశ్వరరావు (కేఎన్ఆర్) మాట్లాడుతూ..
రాష్ట్ర ప్రజల ఆయురారోగ్యాలు, సుఖశాంతులు, రాష్ట్ర అభివృద్ధి, రైతుల సంక్షేమం, యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కలగాలని శ్రీవారిని ప్రార్థించనున్నట్లు తెలిపారు. అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని, ప్రజలందరికీ శ్రేయస్సు చేకూరాలని ఆకాంక్షించారు.
పాదయాత్రలో పలువురు భక్తులు కోళ్ల నాగేశ్వరరావును కలిసి అభివాదం చేయగా, ఆయన వారితో ఆత్మీయంగా ముచ్చటించారు. భక్తితో శ్రీవారి దర్శనం కోసం కాలినడకన ప్రయాణించడం తనకు ఎంతో ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుందని తెలిపారు.
శ్రీవారి దర్శనం అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొని రాష్ట్ర ప్రజల సంక్షేమం, దేశాభివృద్ధి, మంచి వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించనున్నట్లు కోళ్ల నాగేశ్వరరావు వెల్లడించారు.

