📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Tirupati : తిరుపతి సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీసులో ఏసీబీ సోదాలు..రూ.2.48 లక్షల నగదు స్వాధీనం

తిరుపతి జిల్లా : తిరుపతి సిటీ : స్వచ్ఛవార్త :

పట్టణంలోని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోమవారం తనిఖీలు నిర్వహించారు. సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసులు సిబ్బందితో కార్యాలయానికి చేరుకుని సోదాలు చేపట్టారు. 

దీంతో సిబ్బంది, డాక్యుమెంట్‌ రైటర్లలో కలకలం రేగింది. కార్యాలయంలో తనిఖీలు నిర్వహించిన ఏసీబీ అధికారులు లెక్కల్లో చూపని రూ.2.48 లక్షల నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆ నగదు వివరాలకు సంబంధించి సబ్‌ రిజిస్ట్రార్‌ లక్ష్మీదేవిని విచారించారు. 

నగదుతోపాటు కార్యాలయంలోని రిజిస్ట్రేషన్‌ రికార్డులను, సంబంధిత దస్తావేజులను, నగదు లావాదేవీలకు సంబంధించిన వివరాలను పరిశీలించారు. ఏసీబీ తనిఖీలు కొనసాగుతుండడంతో కార్యాలయానికి వచ్చిన డాక్యుమెంట్‌ రైటర్లు ఆందోళనకు గురయ్యారు. దీంతో వీరిని కూడా విచారిస్తున్నట్టు సమాచారం. 

డీఎస్పీ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ.. 

అవినీతి ఫిర్యాదులు రావడంతో తనిఖీలు జరిపామన్నారు. అన్‌ అకౌంటెడ్‌గా ఉన్న రూ2.48లక్షలను స్వాధీనం చేసుకున్నామని, సోమవారం జరిగిన 42 రిజిస్ట్రేషన్లను కూడా పరిశీలిస్తున్నామన్నారు

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం