📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Vijayawada : మైనారిటీల అభివృద్ధికి రూ.8.76 కోట్లు..

  • ఎంపీ కేశినేని చిన్ని ప్రశ్నతో పార్లమెంట్‌లో స్పందించిన కేంద్రం..            
  • లబ్బీపేటలో చిత్రపటానికి పాలాభిషేకం..

ఎన్టీఆర్ జిల్లా : విజయవాడ : స్వచ్ఛవార్త :

మైనారిటీల అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించిన నిధులపై పార్లమెంట్‌లో ప్రశ్నించిన విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ప్రశ్నకు కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ స్పందించింది. ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం (పీఎంజేవీకే) కింద మైనారిటీల అభివృద్ధి కోసం రూ.8.76 కోట్లు విడుదల చేసినట్లు కేంద్రం వెల్లడించింది.

ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షుడు షేక్ కరీముల్లా ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఏడు నియోజకవర్గాల్లో ఎంపీ కేశినేని చిన్ని చిత్రపటానికి పాలాభిషేకాలు నిర్వహించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని లబ్బీపేటలో నిర్వహించిన కార్యక్రమంలో మైనారిటీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కరీముల్లా మాట్లాడుతూ :   విద్య, మహిళా సాధికారత, క్రీడలు, మౌలిక వసతులు, ఆర్థిక అభివృద్ధికి పీఎంజేవీకే నిధులు దోహదపడతాయని తెలిపారు. మైనారిటీల సమస్యలను పార్లమెంట్‌లో ప్రస్తావించిన ఎంపీ కేశినేని చిన్నికి కృతజ్ఞతలు తెలిపారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం