📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Amaravati : 31 నుంచి 4వ ర్యాంకుకు.. ఏలూరు జిల్లా దూకుడు.. సీఎం చంద్రబాబు ప్రశంసలు

అమరావతి : స్వచ్ఛవార్త :

రాష్ట్రంలోని జిల్లాల ప్రగతి, పనితీరుపై శుక్రవారం నిర్వహించిన సమీక్షలో ఏలూరు జిల్లా విశేష ప్రతిభ కనబరిచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నుంచి ప్రత్యేక ప్రశంసలు అందుకుంది. గతంలో 31వ స్థానంలో ఉన్న జిల్లా ఏకంగా 27 స్థానాలు మెరుగుపడి 4వ ర్యాంకుకు చేరుకోవడంపై సీఎం హర్షం వ్యక్తం చేశారు.

జిల్లాల ర్యాంకింగ్‌లకు సంబంధించిన వివరాలను అధికారులు సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రికి వివరించారు. ఏలూరు జిల్లా సాధించిన పురోగతిపై స్పందించిన చంద్రబాబు.. “అన్ని జిల్లాల కంటే ఏలూరు మెరుగైన పనితీరు (బెస్ట్ పర్ఫార్మెన్స్) కనబరిచింది” అని ప్రశంసించారు.

ఈ విజయానికి కృషి చేసిన జిల్లా ఇన్‌చార్జి మంత్రి, కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బందిని సీఎం అభినందించారు. సమష్టి కృషితోనే ఈ పురోగతి సాధ్యమైందని పేర్కొన్నారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం