Bapatla : బాపట్ల రూరల్ నూతన ఎస్సైగా చంద్రశేఖర్
బాపట్ల జిల్లా : బాపట్ల : స్వచ్ఛవార్త :
బాపట్ల రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్సైగా చంద్రశేఖర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూరల్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.
ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాలపై నిఘా, ప్రజలకు భద్రత కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు.