Bhimavaram : మావుళ్లమ్మ స్వర్ణ వస్త్రానికి 16 గ్రాముల బంగారు కానుక
పశ్చిమగోదావరి జిల్లా : భీమవరం : స్వచ్ఛవార్త :
భీమవరం మావుళ్లమ్మవారి దేవస్థానం చేపట్టిన ‘సంపూర్ణ స్వర్ణ వస్త్రం’ ప్రాజెక్టుకు భక్తుల నుంచి విరాళాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం భీమవరానికి చెందిన గవర శేషగిరిరావు తన కుమారుడు గవర రాహుల్ పేరుతో అమ్మవారికి 16 గ్రాముల బంగారాన్ని విరాళంగా సమర్పించారు.
అమ్మవారి స్వర్ణ వస్త్రం ప్రాజెక్టుకు బంగారం సమర్పించిన దాతను ఆలయ వర్గాలు అభినందించాయి. దాత సమర్పించిన బంగారు కానుకను ఆలయ అధికారులు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి దాత కుటుంబ సభ్యులకు ఆశీర్వచనాలు అందించారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్, చైర్మన్ బొండాడ నాగభూషణం దాతను అభినందించారు. ఆలయ ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్, ఉదిశి మీనాక్షి, పాపోలు ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. దాత కుటుంబ సభ్యులకు ఆలయ ప్రసాదం, అమ్మవారి ఫొటో అందజేశారు.
సంపూర్ణ స్వర్ణ వస్త్రం ప్రాజెక్టుకు భక్తులు తమవంతు సహకారం అందించి భాగస్వాములు కావాలని ఆలయ వర్గాలు కోరాయి.