📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Bhimavaram : ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం.. భీమవరంలో వినతులు స్వీకరించిన టీడీపీ నేతలు

పశ్చిమ గోదావరి జిల్లా : భీమవరం : స్వచ్ఛవార్త :

భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రజల నుంచి వినతిపత్రాల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి, రాష్ట్ర టీడీపీ కార్యదర్శి కోళ్ళ నాగేశ్వరరావు (కేఎన్‌ఆర్) ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

కార్యక్రమంలో తోట సీతారామలక్ష్మి, కేఎన్‌ఆర్ లు మాట్లాడుతూ..

ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు. ప్రజలు తమ సమస్యలను వినతిపత్రాల రూపంలో తమ దృష్టికి తీసుకువచ్చారని, వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు.

నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు రహదారులు, తాగునీరు, పారిశుధ్యం, పింఛన్లు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు తదితర సమస్యలను నేతల దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి వినతిని పరిశీలించి సాధ్యమైనంత త్వరగా పరిష్కారం లభించేలా చర్యలు తీసుకుంటామని నేతలు హామీ ఇచ్చారు. 

కార్యక్రమంలో టీడీపీ కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం