📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Bhimavaram : మావుళ్లమ్మ సన్నిధిలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాల ప్రారంభం

 

పశ్చిమ గోదావరి జిల్లా  : భీమవరం : స్వచ్ఛవార్త :

భీమవరం పట్టణంలోని ప్రముఖ ఆరాధ్యదైవం  మావుళ్లమ్మవారి ఉపాలయంలో కొలువై ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామివారి గణపతి నవరాత్రి ఉత్సవాలు సోమవారం భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో కలశస్థాపన, ప్రత్యేక పూజా కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు.

ఆలయ చైర్మన్‌ బొండాడ నాగభూషణం–శిల్ప దంపతులు కలశస్థాపన పూజ, వినాయక చవితి పూజల్లో పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛారణల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించారు. విఘ్నేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్, అతికెల ఆంజనేయ ప్రసాద్, పాపోలు ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. గణపతి నవరాత్రుల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ అసిస్టెంట్‌ కమిషనర్‌ బుద్ధ మహాలక్ష్మి నగేష్‌ తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆలయ నిర్వాహకులు కోరారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం