Bhimavaram : విఘ్నేశ్వర స్వామివారికి కిలో వెండితో పాలవెల్లి విరాళం
పశ్చిమగోదావరి జిల్లా : భీమవరం : స్వచ్ఛవార్త :
భీమవరం పట్టణంలోని ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి ఉపాలయంలో కొలువైన శ్రీ విఘ్నేశ్వర స్వామివారికి భక్తిశ్రద్ధలతో వెండి పాలవెల్లిని విరాళంగా సమర్పించారు. భీమవరానికి చెందిన గిన్నీ రామకుమారి సుమారు రూ.2.50 లక్షల విలువైన 1,037 గ్రాముల (కిలో 37 గ్రాములు) వెండి పాలవెల్లిని ఆలయానికి అందజేశారు.
ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, దాతకు ఆశీర్వచనాలు అందించారు. వెండి పాలవెల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి సన్నిధిలో సమర్పించారు.
కార్యక్రమంలో ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్, ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్, ఉదిశి మీనాక్షి, మల్లువలస లక్ష్మి నిర్మల, గొంతెన రమణ, యండా సత్యవతి, ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు, పాపోలు ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.
అనంతరం ఆలయ కమిటీ తరఫున దాత గిన్నీ రామకుమారిని సత్కరించి శేషవస్త్రం, ప్రసాదం, జ్ఞాపిక అందజేశారు. ఆలయ అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు భక్తులు స్వచ్ఛందంగా విరాళాలు అందించడం అభినందనీయమని ఆలయ నిర్వాహకులు పేర్కొన్నారు.
