📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Bhimavaram : శ్రీ మావుళ్లమ్మ సన్నిధిలో భక్తి శ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతాలు


ప.గో. జిల్లా : భీమవరం : స్వచ్ఛవార్త : 

శ్రావణ శుక్రవారం సందర్భంగా భీమవరం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానంలో సామూహిక వరలక్ష్మీ వ్రత కుంకుమ పూజలు వైభవంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళలు, భక్తులు పాల్గొనడంతో ఆలయ ప్రాంగణం భక్తిశ్రద్ధలతో నిండిపోయింది.

అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వ్రతంలో పాల్గొన్న మహిళలకు దేవస్థానం ఆధ్వర్యంలో చీర, రవికతో పాటు లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు, సిబ్బంది ఏర్పాట్లు చేశారు.

ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లిఖార్జున శర్మ మాట్లాడుతూ.. వరలక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో ఆరాధించడం ద్వారా కుటుంబాల్లో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సౌభాగ్యం, సంతానం, శుభసంపదలు కలగాలని ఆకాంక్షించారు. అమ్మవారి కరుణాకటాక్షాలతో భక్తుల కుటుంబాలు సుఖసంతోషాలతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని కోరుకున్నారు.

“ఒక్కొక్కరి ప్రార్థన ఒక దీపం అయితే.. వేలాది మంది భక్తులు కలిసి చేసే సామూహిక ప్రార్థన మహాదీపంలా వెలిగి సమాజానికి శుభాన్ని ప్రసాదిస్తుంది” అని దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్, ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తల మండలి సభ్యులు పేర్కొన్నారు. అమ్మవారి అనుగ్రహంతో ప్రతి ఇంటా ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సౌభాగ్యం నిండాలని ఆకాంక్షించారు.

కార్యక్రమానికి భక్తులు, దాతలు విశేషంగా సహకరించారు. అమ్మవారి పుట్టింటి వ్యవహారంలో భాగంగా మెంటే కుటుంబీకులు చీర, రవికలను బహుకరించారు. భీమవరం పట్టణ ప్రముఖులు, పలువురు దాతలు బియ్యం, కొబ్బరికాయలు, అరటిపండ్లు తదితర పూజా సామగ్రిని సమకూర్చారు. దాతల సహకారంతో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినట్లు ప్రధాన అర్చకులు తెలిపారు.

కార్యక్రమం విజయవంతానికి సహకరించిన దేవస్థానం ధర్మకర్తల మండలి, పోలీస్, మున్సిపల్ శాఖల అధికారులు, సిబ్బంది, భక్తులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సేవకులకు అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్, చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్, వుదిసి మీనాక్షి, అతికెల ఆంజనేయ ప్రసాద్, గుసిడి నాగశిరీష, కారెంపూడి ఆదిలక్ష్మి, అరసవల్లి బాల సుబ్రహ్మణ్యం, మల్లువలస లక్ష్మి నిర్మల, గొంతిన రమణ, యండ సత్యవతి, ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు, పాపోలు ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం