📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Bhimavaram : శ్రీ మావుళ్లమ్మ స్వర్ణ వస్త్రానికి భక్తుని పసిడి కానుక

పశ్చిమగోదావరి జిల్లా : భీమవరం : స్వచ్ఛవార్త :

శ్రీ మావుళ్లమ్మవారి దేవస్థానం చేపట్టిన సంపూర్ణ స్వర్ణ వస్త్రం ప్రాజెక్టుకు భక్తుల నుంచి బంగారం విరాళాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం మంగళగిరికి చెందిన భోగి అంజియ్య–తిరుపతమ్మ దంపతులు 6 గ్రాముల 400 మిల్లీగ్రాముల బంగారాన్ని ఆలయానికి విరాళంగా అందజేశారు.

ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించి దంపతులకు ఆశీర్వచనాలు అందించారు. అనంతరం ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం, శేషవస్త్రం ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్, అతికెల ఆంజనేయ ప్రసాద్, మిర్తిపాటి గున్నేశ్వరరావు, ఇందుకూరి సుబ్రమణ్యం రాజు తదితరులు దంపతులకు జ్ఞాపిక, ప్రసాదం అందజేశారు.

సంపూర్ణ స్వర్ణ వస్త్రం ప్రాజెక్టుకు భక్తులు తమవంతుగా బంగారం, విరాళాలు అందించి భాగస్వాములు కావాలని ఆలయ అధికారులు కోరారు. భక్తుల సహకారంతో ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు కొనసాగుతున్నాయని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ ఓ ప్రకటనలో తెలిపారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం