Bhimavaram : గురువుల సేవలు చిరస్మరణీయం.. ఉపాధ్యాయుల సన్మాన సభలో "కేఎన్‌ఆర్"
పశ్చిమగోదావరి జిల్లా : భీమవరం : స్వచ్ఛవార్త :
స్థానిక పట్టణ పార్టీ కార్యాలయంలో గురుపూజోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మద్దుల రాము, చెల్లబోయిన గోవింద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ళ నాగేశ్వరరావు (కేఎన్‌ఆర్) ముఖ్య అతిథిగా హాజరై ఉపాధ్యాయులు, గురువుల గొప్పతనం, సర్వేపల్లి రాధాకృష్ణన్ సేవల గురించి ప్రసంగించారు.
గురువుల పాత్ర కీలకం :
కార్యక్రమంలో కేఎన్‌ఆర్ మాట్లాడుతూ..
విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. సమాజ నిర్మాణంలో గురువులు అందిస్తున్న సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. విద్యాశాఖపై మంత్రి నారా లోకేష్ చేస్తున్న కృషిని ఈ సందర్భంగా కొనియాడారు.
ఉపాధ్యాయులకు సన్మానం :
గురుపూజోత్సవం సందర్భంగా కార్యక్రమానికి హాజరైన ఉపాధ్యాయులను టీడీపీ నాయకులు ఘనంగా సన్మానించారు. గురువుల సేవలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని నాయకులు పేర్కొన్నారు.
కార్యక్రమంలో విజ్జురోతు రాఘవులు, నౌషాద్, ఐజాక్, గంటా త్రిమూర్తులు, మాదాసు కనకదుర్గ, షాబీనా, సాబీనా, కొండ్రు శ్రీను, బాబూరావు, ఫిరోజ్, గంగాధర్, నరసింహమూర్తి, షాబు, రావూరి కృష్ణ, అప్పారావుతో పాటు బూత్, యూనిట్, క్లస్టర్, వార్డు, టౌన్, జిల్లా, రాష్ట్ర స్థాయి టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
