Buttayagudem : 50 ఏళ్ళు వయసు దాటిన ఎస్సీ, బీసీలకు పెన్షన్లు ఇవ్వాలి : కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి అందుగుల ఫ్రాన్సిస్.
ఏలూరు జిల్లా : బుట్టాయగూడెం : స్వచ్ఛవార్త :
గత ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 50 సంవత్సరాలు దాటిన ఎస్సీ, బీసీ పేదలకు పెన్షన్లు మంజూరు చేయాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కార్యదర్శి అందుగుల ఫ్రాన్సిస్ డిమాండ్ చేశారు. బుట్టాయిగూడెం లో సోమవారం స్థానిక పత్రికలకు విడుదల చేసిన ఒక ప్రకటనలో చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఎస్సి, బిసి, పేద వర్గాల పెన్షన్ లపై చేసిన హామీలను ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, మూడు సంవత్సరాలు కావస్తున్నప్పటికీ నెరవేర్చకపోవడం సిగ్గుచేటు అన్నారు.
ఇప్పటికైనా ఎస్సీ బీసీలకు పెన్షన్ నమోదు చేయాలని లేని పక్షంలో రాబోయే స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకించే అవకాశం ఉందని ఫ్రాన్సిస్ అన్నారు. నెరవేర్చలేని హామీలతో ప్రజలను మోసం చేసిన ఏ ప్రభుత్వం ఎక్కువకాలం అధికారంలో కొనసాగలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయాలని, లేని పక్షంలో ఎస్సీ బీసీ పేదలను ఐక్యం చేసి మండల కేంద్రాల వద్ద ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
