Buttayagudem : గిరిజన నిరుద్యోగ యువతకు డ్రైవింగ్ శిక్షణ
ఏలూరు జిల్లా : బుట్టాయగూడెం : స్వచ్ఛవార్త :
కోట రామచంద్రపురం, సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ, యువత శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో గిరిజన నిరుద్యోగ యువతకు డ్రైవింగ్ శిక్షణ కార్యక్రమం చేపట్టినట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కె రాముల నాయక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఈనెల 17వ తేదీ నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు నిర్వహించినట్లు చెప్పారు.
ఈ శిక్షణా కాలంలో గిరిజన నిరుద్యోగ యువకులకు ఉచిత వసతి, భోజన సదుపాయాలను కల్పిస్తూ డ్రైవింగ్ శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ శిక్షణ తరగతుల కార్యక్రమములో ఎల్.ఎల్.ఆర్. మరియు డ్రైవింగ్ లైసెన్స్ పొందే విధానంపై జంగారెడ్డిగూడెం ఇంచార్జి ఆర్టీవో కె.డి.వి. రవి గోపాల్ అభ్యర్థులకు అవగాహన కల్పిస్తారని తెలిపారు.
ఏలూరుకు చెందిన యూనివర్సల్ కార్ డ్రైవింగ్ స్కూల్ ద్వారా అభ్యర్థులకు శిక్షణ అందిస్తున్నట్లు చెప్పారు. ఈ డ్రైవింగ్ శిక్షణ తరగతులు గిరిజన యువత సద్వినియో పరచు కోవలసినదిగా కోరారు. శిక్షణ పూర్తి అయిన 30 మందికి ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ కూడా మంజూరు చేస్తానని చెప్పారు.
