📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Eluru : మహానేత వైఎస్సార్ ఆశయాలే స్ఫూర్తి.. ఘన నివాళులర్పించిన డీఎన్‌ఆర్

ఏలూరు జిల్లా : ఏలూరు : స్వచ్ఛవార్త :

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతిని పురస్కరించుకుని బుధవారం ఏలూరులోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయనకు ఘన నివాళులు అర్పించారు. కైకలూరు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు (డీఎన్‌ఆర్) పార్టీ నాయకులతో కలిసి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ.. 

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేపట్టిన జలయజ్ఞం కార్యక్రమం కోట్లాది మంది రైతుల జీవితాల్లో కొత్త ఆశలు నింపిందని అన్నారు. సాగునీటి కాలువల ద్వారా జలసిరులు పారించి కరువును తరిమికొట్టేందుకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. రైతుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.

కార్యక్రమంలో ఏలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి మామిళ్లపల్లి జయప్రకాష్ (జేపీ), రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.





షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం