Eluru : పనితీరులో బడేటి సిక్సర్.. ఎమ్మెల్యేల ర్యాంకుల్లో ఆరో స్థానం
ఏలూరు జిల్లా : ఏలూరు : స్వచ్ఛవార్త :
మాటలకే పరిమితం కాకుండా పనితీరుతో సత్తా చాటుతున్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి రాష్ట్రస్థాయి మూల్యాంకనంలో 6వ ర్యాంకు సాధించారు. ఎమ్మెల్యేల పనితీరును వివిధ అంశాల ఆధారంగా వెల్లడించిన మూల్యాంకనంలో ఆయనకు ఈ స్థానం దక్కింది.
ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాల అమలు, ప్రజలకు అందుబాటులో ఉండటం తదితర అంశాల్లో చూపిన పనితీరుకు ఈ ర్యాంకు నిదర్శనంగా నిలిచిందని టీడీపీ శ్రేణులు పేర్కొంటున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు అంచనాలకు అనుగుణంగా పనిచేస్తూ ప్రజల మన్ననలు అందుకుంటున్నారని తెలిపారు.
“పనితీరులో చంటి సిక్సర్.. ర్యాంకుల్లోనూ సిక్స్!” అంటూ టీడీపీ శ్రేణులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.