📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Eluru : రైతులకు ఎంపీ పుట్టా మహేష్‌కుమార్‌ భరోసా.. కొద్ది నెలల్లోనే కొల్లేరు భూసమస్యకు పరిష్కారం

ఏలూరు జిల్లా : ఏలూరు ఎంపీ కార్యాలయం : స్వచ్ఛవార్త :   

కొల్లేరు భూముల సమస్యకు కొద్ది నెలల్లోనే పరిష్కారం లభిస్తుందని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌కుమార్‌ కొల్లేరు రైతులకు భరోసా ఇచ్చారు. ఆదివారం ఏలూరులోని తన కార్యాలయంలో కొల్లేరు ప్రాంత రైతులతో ఎంపీ సమావేశమయ్యారు. తమ సమస్యపై పోరాడుతున్న ఎంపీకి రైతులు కృతజ్ఞతలు తెలిపారు.

కొల్లేరు రైతులతో ఎంపీ పుట్టా మహేష్ మాట్లాడుతూ :

20 వేల ఎకరాలకు పైగా ఉన్న జిరాయితీ, సొసైటీ భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తానని, రైతుల్లో అధికశాతం బీసీ, ఎస్సీ వర్గాలకు చెందినవారేనని, వారికి అన్యాయం జరగకుండా సుప్రీంకోర్టు సాధికార కమిటీ (సీఈసీ)తో పలుమార్లు చర్చించినట్లు చెప్పారు. పర్యావరణ పరిరక్షణతో పాటు రైతుల న్యాయసమ్మత హక్కులు, జీవనోపాధిని కాపాడేలా కాంటూరు కుదింపు సమస్యకు పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందన్నారు. సుప్రీంకోర్టులో రైతులకు అనుకూల తీర్పు వస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా కొల్లేరు కొట్టాడకు చెందిన భలే యేసురాజు నేతృత్వంలో రైతులు ఎంపీని ఘనంగా సన్మానించారు. అనంతరం నిర్వహించిన ప్రజాదర్బార్‌లో ప్రజలు, కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించిన ఎంపీ.. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం