📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Ghantasala : ఘంటసాల మండలంలో ఎస్సీ, ఎస్టీ, బీసీల ఓటర్ల తుదిజాబిత విడుదల.. అన్ని వర్గాల్లో మహిళా ఓటర్లే అధికం

కృష్ణా జిల్లా : ఘంటసాల : స్వచ్ఛవార్త :

ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు ఘంటసాల మండలంలోని 22 గ్రామ పంచాయతీలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల తుది జాబితాను మండల పరిషత్ కార్యాలయం నోటీసు బోర్డులో ప్రదర్శించినట్లు ఎంపిడివో డి.సుబ్బారావు సోమవారం సాయంత్రం తెలిపారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఘంటసాల మండలంలో మొత్తం 33,134 ఓటర్లు ఉండగా పురుషులు 16,129, మహిళలు 17005 మంది ఉన్నారన్నారు. 

వీరిలో ఎస్సీ ఓటర్లు 12,865 మంది ఉండగా పురుషులు 6242, మహిళలు 6623 మంది ఉన్నారు.

ఎస్టీ ఓటర్లు 898 మంది ఉండగా పురుషులు 427, మహిళలు 471 మంది ఉన్నారు.

బీసీ ఓటర్లు 10,892 మంది ఉండగా పురుషులు 5303, మహిళలు 5589 మంది ఉన్నారు.

ఇతరులు 8479 మంది ఉండగా వీరిలో పురుషులు 4157, మహిళలు 4322 మంది ఉన్నారని తెలిపారు. 

ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపిడివో కె.వెంకటేశ్వరరావు, మండల పరిషత్ ఏవో జె.లలిత ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు. 

ఘంటసాల మండలంలో ఎస్సీలవే అత్యధిక ఓట్లు :

ఘంటసాల మండలంలో అత్యధికంగా ఎస్సీ ఓటర్లు ఉండగా, రెండవ స్థానంలో బీసీ ఓటర్లు, తృతీయ స్థానంలో ఇతరులో, అత్యల్పంగా ఎస్టీ ఓటర్లు ఉన్నారు. కాగా అన్ని వర్గాల ఓటర్లలో మహిళా ఓటర్లే ఎక్కువుగా ఉండటం విశేషం.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం