Gudivada : సిద్ధి వినాయకుడి సన్నిధిలో టీడీపీ నేతల ప్రత్యేక పూజలు
కృష్ణా జిల్లా : గుడివాడ : స్వచ్ఛవార్త :
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలోని ఎన్టీఆర్ కాలనీ శివారు గణేష్‌నగర్‌లో కొలువైన త్రిశక్తి త్రిమూర్త స్వరూప శ్రీ సిద్ధి వినాయక స్వామివారిని ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు, రాష్ట్ర దళిత నాయకులు జక్కుల విజయ్‌కుమార్, బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్షులు, టీడీపీ సీనియర్ నాయకులు కట్టా గోపి, రాష్ట్ర బీసీ నాయకులు కట్టా రాఘవులు సోమవారం దర్శించుకున్నారు.
శ్రీ సిద్ధి వినాయక స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవస్థానం ప్రెసిడెంట్ సోమన నాగేంద్ర, కమిటీ సభ్యులు నాయకులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నాయకులు దేవస్థానం కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో దేవస్థానం గౌరవ అధ్యక్షులు బురిడీ రామకృష్ణ, వైస్ ప్రెసిడెంట్ తిప్పా వకుల్ కుమార్, సెక్రటరీ నిల్లా కోట వెంకటేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ పప్పు రాంబాబు, కోశాధికారి సిద్దాని కోటేశ్వరరావు, ఉప కోశాధికారి నిల్లా లక్ష్మీ గణేష్, కార్యవర్గ సభ్యులు నిల్లా జ్యోతిశ్వరరావు, సోమన కోట బుద్ధ కేదారేశ్వర కుమార్, సోమన హేమ సుందర శ్రీనివాసరావు, అనుపోజు రాజేష్ తదితరులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
