Gudlavalleru : శ్రీ కొండలమ్మ సన్నిధిలో శ్రావణ శుక్రవారం వేడుకలు.. రామరాజు కుటుంబం ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ.. దాతలకు ఈవో కొండలరావు సత్కారం
కృష్ణా జిల్లా : గుడ్లవల్లేరు/వేమవరం : స్వచ్ఛవార్త :
వేమవరం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ కార్యదర్శి కొడాలి రామరాజు దంపతుల ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు.
రామరాజు కుటుంబం పేరిట ప్రత్యేక పూజలు :
దాతలు రామరాజు కుటుంబం పేరిట దేవస్థాన చైర్మన్ ఈడే వెంకట విష్ణు మోహనరావు, ఈఓ ఆకుల కొండలరావు, ధర్మకర్తల మండలి సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రామరాజు కుటుంబ సభ్యులను దుశ్శాలువాలతో సత్కరించారు.
పలువురు ప్రముఖుల హాజరు :
కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వేర్‌హౌసింగ్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, టీడీపీ సీనియర్ నాయకులు చేకూరి జగన్మోహనరావు, పీఏసీఎస్ అధ్యక్షుడు అట్లూరి శ్రీరామచంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
