📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Jeelugumilli : గిరిజన రైతులకు అన్యాయం జరిగితే సహించను.. భూసేకరణలో అక్రమాలకు తావులేదు : ఎమ్మెల్యే బాలరాజు


ఏలూరు జిల్లా : జీలుగుమిల్లి : స్వచ్ఛవార్త :

పోలవరం నియోజకవర్గంలో భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌ ప్రక్రియకు సంబంధించి రైతులు, గిరిజనులకు ఎలాంటి అన్యాయం జరగకుండా అధికారులు నిబంధనల ప్రకారం పారదర్శకంగా వ్యవహరించాలని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అన్నారు.

భూసేకరణ విషయంలో అవినీతి, అక్రమాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ తావివ్వబోమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. భూములు కోల్పోతున్న రైతులు, గిరిజనులకు చట్టపరంగా అందాల్సిన హక్కులు, పరిహారం పూర్తిస్థాయిలో అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

1/70, పీసా వంటి గిరిజన చట్టాలను ఉల్లంఘించి గిరిజనుల భూముల విషయంలో అక్రమ లావాదేవీలు జరిగితే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను హెచ్చరించారు. గిరిజనుల సాగు భూములను అన్యాయంగా ఇతరుల పేర్లపైకి మార్చడం లేదా మధ్యవర్తుల ద్వారా లావాదేవీలు నిర్వహించడం వంటి చర్యలను సహించేది లేదన్నారు.

భూసేకరణ వ్యవహారాల్లో మధ్యవర్తులు, దళారులు ఎమ్మెల్యే పేరు చెప్పి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని, అలాంటి వ్యక్తులపై ఆధారాలతో విచారణ జరిపించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరుతున్నట్లు తెలిపారు. భూసేకరణలో మిగులు భూముల విషయంలో కూడా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని, అర్హులైన గిరిజన రైతులకు భూములపై హక్కులు, సాగు అవకాశాలు కల్పించేలా చూడాలని ఎమ్మెల్యే అన్నారు.

గతంలో భూసేకరణకు సంబంధించి జరిగిన అక్రమాలపై కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని ఎమ్మెల్యే కోరారు. అవసరమైన ఆధారాలను సేకరించి వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకువస్తామని చెప్పారు.

పోలవరం ప్రాజెక్టు కారణంగా నిర్వాసితులవుతున్న కుటుంబాల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, నిర్వాసితుల సమస్యలు, ఆర్‌అండ్‌ఆర్‌, భూసేకరణ అంశాలను ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తెలిపారు.

“రైతులకు, గిరిజనులకు అన్యాయం జరగకుండా చూడటం నా బాధ్యత. భూసేకరణ ప్రక్రియలో ఎక్కడైనా అక్రమాలు జరిగినట్లు ఆధారాలు ఉంటే వాటిపై విచారణ జరిపించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా కృషి చేస్తాను. ప్రజల హక్కుల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు” అని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు స్పష్టం చేశారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం