Kalidindi : మట్టగుంట ZPHS లో మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించిన అండ్రాజు శ్రీనివాసరావు
ఏలూరు జిల్లా : కలిదిండి : స్వచ్ఛవార్త :
మండలంలోని మట్టగుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను గురువారం రాష్ట్ర అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ అండ్రాజు శ్రీనివాసరావు సందర్శించారు.
ఈ సందర్భంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులకు అందిస్తున్న వెజ్ పలావ్, ఆలూ కూర్మా, ఉడికించిన కోడిగుడ్డు నాణ్యత, రుచి, పరిశుభ్రతను పరిశీలించారు. భోజనాన్ని స్వయంగా రుచి చూసి నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం విద్యార్థులతో మాట్లాడి మధ్యాహ్న భోజనం నాణ్యత, రుచి, పాఠశాలలో అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. ఉపాధ్యాయులతో మాట్లాడి విద్యా ప్రమాణాలు, విద్యార్థుల అవసరాలపై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందించడం అందరి బాధ్యత అని అండ్రాజు శ్రీనివాసరావు పేర్కొన్నారు.