📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Kankipadu : విధి నిర్వహణలో గాయపడిన కానిస్టేబుల్‌కు జిల్లా ఎస్పీ పరామర్శ


కృష్ణా జిల్లా : కంకిపాడు/మచిలీపట్నం : స్వచ్ఛవార్త : 

విధి నిర్వహణలో కత్తి దాడికి గురై కంకిపాడులోని సిహెచ్ హెల్త్ సెంటర్‌లో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్‌ను కృష్ణా జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు మంగళవారం పరామర్శించారు. పోలీసు అధికారులతో కలిసి ఆసుపత్రికి వెళ్లిన ఎస్పీ.. కానిస్టేబుల్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

తూర్పుగోదావరి జిల్లా ఎర్నగూడెం వద్ద గంజాయి రవాణాను అడ్డుకునే సమయంలో పోలీసులపై దాడి చేసి పరారైన నిందితుడిని కంకిపాడు పరిసరాల్లో గుర్తించి అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో నిందితుడు కత్తితో దాడి చేయడంతో కానిస్టేబుల్ గాయపడ్డారు.

ఆసుపత్రి వైద్యులతో మాట్లాడిన ఎస్పీ.. అందుతున్న చికిత్స వివరాలను తెలుసుకుని, మెరుగైన వైద్యం అవసరమైతే ఉన్నత వైద్య కేంద్రానికి తరలించేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. పోలీసు శాఖ అన్ని విధాలా అండగా ఉంటుందని కానిస్టేబుల్‌కు భరోసా ఇచ్చారు.

అనంతరం ఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించిన ఎస్పీ.. నిందితుడి కదలికలు, పోలీసులు చేపట్టిన చర్యలు, కేసు దర్యాప్తు పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం