📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Machilipatnam : నూతన పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన ప్రక్రియను నిర్ణీత గడువులో పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

  • అర్జీదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి
  • దరఖాస్తుల సులభ సమర్పణకు అన్ని చర్యలు తీసుకోవాలి

కృష్ణా జిల్లా : మచిలీపట్నం : స్వచ్ఛవార్త :

ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద నూతన పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, అర్హత నిర్ధారణ, సిఫార్సు ప్రక్రియలను ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు, నిర్దేశిత కాలపరిమితి ప్రకారం పూర్తి చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.

నూతన పింఛన్ల దరఖాస్తుల ప్రక్రియపై సోమవారం ఎంపీడీవోలు, డీఎల్‌డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, పీడీ – డీఆర్డీఏ తదితర అధికారులతో కలెక్టర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

ప్రభుత్వం జారీ చేసిన మెమో నెంబర్.3407491/ఆర్ డి. ఐ/ఏ1/2026, తేదీ 06.09.2026 ప్రకారం నూతన పింఛన్ల దరఖాస్తులను స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాల ద్వారా స్వీకరించాల్సి ఉంటుందని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం దరఖాస్తులను స్వీకరించి, ఆన్‌లైన్‌లో నమోదు చేయడంతో పాటు ఈ కేవైసీ ధృవీకరణ చేపట్టాలని సూచించారు.

ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం దరఖాస్తుల పరిశీలన :

దరఖాస్తుల ప్రాథమిక పరిశీలన అనంతరం సాధారణ అర్హత ప్రమాణాలు, ఇప్పటికే ఉన్న పింఛనుదారుల డేటాబేస్ ఆధారంగా ధృవీకరణ చేపట్టాలి. అర్హత ఉన్న దరఖాస్తులను క్షేత్రస్థాయిలో భౌతికంగా పరిశీలించి, దరఖాస్తుదారుడి అర్హత, సమర్పించిన ధ్రువపత్రాలు, ఇతర వివరాలను ధృవీకరించాలి.

భౌతిక పరిశీలన అనంతరం ఎంపీడీవో/మున్సిపల్ కమిషనర్ తదితర సంబంధిత అధికారులు దరఖాస్తులోని వివరాలు, ధ్రువపత్రాలు, అర్హత ధృవీకరణ, పింఛనుదారుల డేటాబేస్, భౌతిక పరిశీలన నివేదిక, ఈ కేవైసీ వివరాలను పరిశీలించి అర్హతను నిర్ణయించాలి. అర్హులైన దరఖాస్తులను తదుపరి స్థాయి ఆమోదానికి సిఫార్సు చేయాలి.

ఎంపీడీవో/మున్సిపల్ కమిషనర్లు పింఛన్లను నేరుగా మంజూరు చేయరాదని, అర్హత కలిగిన దరఖాస్తులను మాత్రమే సిఫార్సు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. తుది ధృవీకరణ, బడ్జెట్ ప్రతిపాదనలు, ప్రభుత్వ ఆమోదం అనంతరం పింఛన్లు మంజూరు అవుతాయని కలెక్టర్ తెలిపారు.

ప్రభుత్వం నిర్దేశించిన కాలపరిమితి :

ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నూతన పింఛన్ల దరఖాస్తుల ప్రక్రియను క్రింది కాలపరిమితిలో పూర్తి చేయాలి:

సెప్టెంబర్ 7–16: దరఖాస్తుల స్వీకరణ, ఆన్‌లైన్ నమోదు, ఈ కేవైసీ ధృవీకరణ – 7 పని దినాలు

సెప్టెంబర్ 17–21: సాధారణ అర్హత పరిశీలన – 3 పని దినాలు

సెప్టెంబర్ 22–24: భౌతిక/శాఖాపరమైన పరిశీలన, అర్హత నిర్ధారణ, సిఫార్సు – 3 పని దినాలు

సెప్టెంబర్ 25–26: బడ్జెట్ ప్రతిపాదనలు, ప్రభుత్వ ఆమోద ప్రక్రియ – 2 పని దినాలు.

ఈ కాలపరిమితిలో ప్రతి దశను ఎటువంటి జాప్యం లేకుండా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

అర్జీదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి :

నూతన పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు వచ్చే అర్జీదారులతో అధికారులు, సిబ్బంది అత్యంత మర్యాదపూర్వకంగా, సహాయక దృక్పథంతో వ్యవహరించాలని కలెక్టర్ డీకే బాలాజీ సూచించారు.

అర్జీదారులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దరఖాస్తులను సులభంగా సమర్పించుకునేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన సమాచారాన్ని వారికి స్పష్టంగా తెలియజేయాలని ఆదేశించారు.

అర్హత ఉన్న దరఖాస్తుదారులకు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం న్యాయం జరిగేలా చూడటంతో పాటు, అనర్హతకు గురైన దరఖాస్తుదారులకు అందుకు గల కారణాలను స్పష్టంగా తెలియజేయాలని సూచించారు. దరఖాస్తుల స్వీకరణ నుంచి తుది పరిశీలన వరకు మొత్తం ప్రక్రియను పారదర్శకంగా, ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండే విధంగా, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం