Machilipatnam : బందరు సాగర తీర మహాగణపతిని దర్శించిన ఏపీ గవర్నర్ నజీర్
కృష్ణా జిల్లా : మచిలీపట్నం : స్వచ్ఛవార్త :
మంగినపూడి సాగర తీరంలో ఏర్పాటు చేసిన 63 అడుగుల సప్తమృత్తిక విజయ గణపతిని రాష్ట్ర గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ మంగళవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గవర్నర్కు వేద పండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఎస్పీ విద్యాసాగర్ తదితరులు గవర్నర్కు స్వాగతం పలికారు. జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
గవర్నర్ మహాగణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొనగా, వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. అనంతరం మహాగణపతి ఉత్సవాల ఏర్పాట్లు, విగ్రహ నిర్మాణ విశిష్టతను ఉత్సవ కమిటీ సభ్యులు గవర్నర్కు వివరించారు.
