📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Machilipatnam : రేపు కృష్ణా జిల్లా కలెక్టరేట్‌లో ఇండస్ట్రియల్ బిజినెస్ మీట్



  • పారిశ్రామిక, వ్యాపార రంగ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వేదిక
  • సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి పిలుపు

కృష్ణా జిల్లా : మచిలీపట్నం : స్వచ్ఛవార్త :

కృష్ణా జిల్లాలో పారిశ్రామిక, వ్యాపార రంగ అభివృద్ధికి మరింత ప్రోత్సాహం అందించేందుకు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో గురువారం (సెప్టెంబరు 17) జిల్లా కలెక్టరేట్‌లో ఇండస్ట్రియల్ బిజినెస్ మీట్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజి ఒక ప్రకటనలో తెలిపారు.

ఇటీవల కృష్ణా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ‘వన్ ఫ్యామిలీ–వన్ ఎంటర్‌ప్రెన్యూర్’ వర్క్‌షాప్‌కు లభించిన విశేష స్పందనకు కొనసాగింపుగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపిన కలెక్టర్, కొత్తగా వ్యాపారం లేదా పరిశ్రమ ప్రారంభించాలనుకునే ఔత్సాహికులు, ఇప్పటికే వ్యాపారాలు నిర్వహిస్తున్న పారిశ్రామికవేత్తలు తమకు ఎదురవుతున్న సమస్యలు, అవసరాలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకువచ్చేందుకు ఈ సమావేశం అవకాశం కల్పిస్తుందని తెలిపారు.

వ్యాపారాలు ప్రారంభించేందుకు అవసరమైన ప్రభుత్వ అనుమతులు, వివిధ శాఖల నుంచి అందాల్సిన సహకారం, ఇతర సమస్యలపై సంబంధిత అధికారులతో నేరుగా చర్చించే అవకాశం ఉంటుందని కలెక్టర్ తెలిపారు. జిల్లా యంత్రాంగానికి చెందిన వివిధ శాఖల అధికారులు సమావేశంలో అందుబాటులో ఉంటారని, సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

కృష్ణా జిల్లాలో వ్యాపార అవకాశాలను అన్వేషిస్తున్న ఇతర ప్రాంతాల పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు కూడా సమావేశంలో పాల్గొని జిల్లాలో అందుబాటులో ఉన్న అవకాశాలు, ప్రభుత్వ సహకారం, అనుమతులు తదితర అంశాలపై అధికారులతో చర్చించవచ్చని కలెక్టర్ తెలిపారు.

గురువారం కలెక్టరేట్‌లో జరిగే ఇండస్ట్రియల్ బిజినెస్ మీట్‌కు పారిశ్రామికవేత్తలు, వ్యాపార ఔత్సాహికులు, పెట్టుబడిదారులు హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు. సమావేశానికి సంబంధించిన సమాచారం కోసం 9989092288 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం