📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Machilipatnam : విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే పొదుపు అలవాటును పెంపొందించాలి : జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

కృష్ణాజిల్లా : మచిలీపట్నం : స్వచ్ఛవార్త :

విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే పొదుపు అలవాటు, ఆర్థిక క్రమశిక్షణ, ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి సూచించారు.

మచిలీపట్నం పోస్టల్ డివిజన్ ఆధ్వర్యంలో చిలకలపూడిలోని పాండురంగ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు గురువారం పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ (ఆర్డీ) ఖాతాల పాస్‌బుక్‌ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని విద్యార్థులకు ఆర్డీ ఖాతాల పాస్‌బుక్‌లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... 

చిన్న మొత్తంలో చేసే పొదుపు కూడా క్రమం తప్పకుండా కొనసాగిస్తే భవిష్యత్‌లో పెద్ద మొత్తంగా మారుతుందని తెలిపారు. ఒక రూపాయి, రెండు రూపాయలు అని చిన్నచూపు చూడకుండా పొదుపు చేయడం అలవాటు చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఇప్పటికే బ్యాంకు ఖాతాలు తెరవడం ఆర్థిక సమ్మిళితంలో భాగంగా అభినందనీయమని, అయితే ఖాతా తెరవడం మాత్రమే సరిపోదని, అందులో క్రమం తప్పకుండా పొదుపు చేయడం కూడా ముఖ్యమని స్పష్టం చేశారు.

చిన్న వయసులోనే పొదుపు, పెట్టుబడులపై అవగాహన పెంచుకుంటే భవిష్యత్‌లో ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు దోహదపడుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఒకేసారి పెద్ద మొత్తాన్ని జమ చేయడం కంటే ప్రతిరోజూ లేదా క్రమం తప్పకుండా చిన్న మొత్తాలను పొదుపు చేయడం ద్వారా ఆర్థిక క్రమశిక్షణ అలవడుతుందని చెప్పారు.

ఒక్క రూపాయి, రెండు రూపాయలు కలిసి పెద్ద మొత్తంగా మారినట్లే, ప్రతిరోజూ క్రమం తప్పకుండా చేసే చిన్న ప్రయత్నాలే భవిష్యత్ విజయానికి పునాది అని కలెక్టర్ తెలిపారు. పొదుపుతో పాటు సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రోజువారీ జీవితంలో వృథా చేసే ఐదు, పది నిమిషాలను సద్వినియోగం చేసుకున్నా వ్యక్తిత్వ వికాసంలో ఎంతో మార్పు వస్తుందని చెప్పారు. విద్యార్థులు బాగా చదువుతూ క్రమశిక్షణ, సమయపాలన, పొదుపు వంటి మంచి అలవాట్లను చిన్ననాటి నుంచే అలవరుచుకోవాలని ఆకాంక్షించారు.

తపాలా శాఖ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు మాట్లాడుతూ, పాండురంగ ఉన్నత పాఠశాలలో కార్యక్రమాన్ని ప్రారంభించగానే విద్యార్థులు, పాఠశాల సిబ్బంది నుంచి విశేష స్పందన లభించిందని, ఇప్పటివరకు 125 ఆర్డీ ఖాతాలు ప్రారంభించడం సంతోషకరమని తెలిపారు. విద్యార్థులు ఇప్పటి నుంచే పొదుపు అలవాటు చేసుకుంటే భవిష్యత్‌లో ఇతరులపై ఆధారపడకుండా ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు సాగగలరని అన్నారు.

కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి యువి సుబ్బారావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం