📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Machilipatnam : పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత : కేడీసీసీ బ్యాంక్ సీఈవో ఎం. శ్యామ్ మనోహర్

  • పర్యావరణాన్ని కాపాడటం కోసం వెలుగు ఫౌండేషన్ మట్టి విగ్రహాలు పంపిణీ... 

కృష్ణాజిల్లా : మచిలీపట్నం : స్వచ్ఛవార్త :

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని కేడీసీసీ బ్యాంక్ సీఈవో ఎం. శ్యామ్ మనోహర్ అన్నారు. వినాయక చవితి సందర్భంగా మట్టి విగ్రహాలను మాత్రమే వినియోగించి పర్యావరణాన్ని పరిరక్షించాలని ప్రజలకు అవగాహన కల్పిస్తూ వెలుగు ఫౌండేషన్ అధ్యక్షులు చందమామ బాబు ఆధ్వర్యంలో రూపొందించిన కరపత్రాలను శుక్రవారం కేడీసీసీ బ్యాంక్ కార్యాలయంలో సీఈవో ఎం. శ్యామ్ మనోహర్, బ్యాంకు అధికారులు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా సీఈవో ఎం. శ్యామ్ మనోహర్ మాట్లాడుతూ.. 

మట్టి వినాయకుడిని పూజించడం అంటే ప్రకృతిని పూజించడంతో సమానమని అన్నారు. మనకు జీవనాధారమైన ప్రకృతిని పరిరక్షించుకునే సందేశాన్ని వినాయక చవితి పండుగ అందిస్తుందని తెలిపారు. వినాయక చవితి పండుగ ప్రకృతితో ముడిపడి ఉందని, మట్టి వినాయక విగ్రహాలను పూజించడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించినవారవుతారని పేర్కొన్నారు.

పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వెలుగు ఫౌండేషన్ చేపడుతున్న కార్యక్రమం అభినందనీయమని శ్యామ్ మనోహర్ ప్రశంసించారు.

వెలుగు ఫౌండేషన్ అధ్యక్షులు చందమామ బాబు మాట్లాడుతూ.. 

సామాజిక బాధ్యతగా ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా మచిలీపట్నం నగరంలోని ప్రధాన కూడళ్లలో మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది ప్రత్యేకంగా మట్టి వినాయక విగ్రహాల్లో విత్తనాలను కూడా ఉంచుతున్నామని చెప్పారు. విగ్రహాన్ని నిమజ్జనం చేసిన అనంతరం ఆ మట్టిని ఇంటి ఆవరణలో లేదా పెరటిలో వినియోగిస్తే అందులోని విత్తనాల ద్వారా మొక్కలు మొలిచేలా ఈ విగ్రహాలను రూపొందిస్తున్నట్లు వివరించారు.

ఈ సందర్భంగా కేడీసీసీ బ్యాంక్ సీఈవో ఎం. శ్యామ్ మనోహర్‌కు మట్టి వినాయక ప్రతిమను అందజేశారు.

కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంక్ డిప్యూటీ జనరల్ మేనేజర్లు పి.జె.ఎస్. ప్రభాకర్, పి. వరలక్ష్మి, సి.హెచ్. రాంబాబు, వెలుగు ఫౌండేషన్ ఉపాధ్యక్షులు రేపల్లె వెంకట వీర వసంతరావు, ఫౌండేషన్ సభ్యులు, బ్యాంకు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం