Machilipatnam : కృష్ణా జిల్లా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు : జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు
కృష్ణాజిల్లా : పోలీసు ప్రధాన కార్యాలయం : మచిలీపట్నం : స్వచ్ఛవార్త :
వినాయక చవితి పర్వదినాన్ని ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో, మతసామరస్యం, సోదరభావం, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు ఆకాంక్షించారు.
పండుగ సందర్భంగా ప్రభుత్వ నిబంధనలు, పోలీసు శాఖ సూచనలు పాటిస్తూ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా వేడుకలను నిర్వహించుకోవాలని, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.
కృష్ణా జిల్లా ప్రజలందరికీ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, సకల శుభాలు కలగాలని ఆకాంక్షిస్తూ జిల్లా పోలీసు శాఖ తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.
