📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Mandavalli : రాజస్థాన్‌లో దాక్కున్న నిందితుడికి మండవల్లి పోలీసుల చెక్‌..!


  • సిగరెట్‌ బాక్సుల చోరీ కేసులో పరారీలో ఉన్న A-1 అరెస్ట్‌..
  • టెక్నికల్‌ ఆధారాలతో ఆచూకీ.. ప్రత్యేక బృందంతో రాజస్థాన్‌లో పట్టివేత..

ఏలూరు జిల్లా : మండవల్లి క్రైమ్ : స్వచ్ఛవార్త :

మండవల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని లోకుముడి గ్రామంలోని రత్న ఎంటర్‌ప్రైజెస్‌ గోడౌన్‌లో సిగరెట్‌ బాక్సుల చోరీ కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు A-1 ను మండవల్లి పోలీసులు రాజస్థాన్‌లో అరెస్ట్‌ చేశారు.

ఈ ఘటనపై జనవరి 6న Cr.No.02/2026 U/s 331(4), 305(a) BNS కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తులో ఇప్పటికే A-2, A-3 లను అరెస్ట్‌ చేసి, చోరీకి గురైన సిగరెట్‌ బాక్సులు, మారుతి సుజుకి ఈకో వ్యాన్‌, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

ప్రధాన నిందితుడు నేరం అనంతరం రాజస్థాన్‌లోని జోద్‌పూర్‌ జిల్లా బిలారా పరిధిలోని జాక్‌ గ్రామంలో ఉన్నట్లు టెక్నికల్‌ ఆధారాలు, మొబైల్‌ కమ్యూనికేషన్‌ వివరాల ద్వారా పోలీసులు గుర్తించారు.

ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్‌ శివకిశోర్‌, ఏలూరు ఎస్‌డీపీవో డి. శ్రవణ్‌ కుమార్‌, కైకలూరు రూరల్‌ సీఐ వి. రవికుమార్‌ ఆదేశాల మేరకు మండవల్లి ఎస్‌ఐ చి.ఎస్‌. రామచంద్రరావు, పీసీలు ఎం. మహేష్‌, పి. రవీంద్రబాబులతో కలిసి సెప్టెంబర్‌ 7న రాజస్థాన్‌ వెళ్లి నిందితుడిని అరెస్ట్‌ చేశారు.

అనంతరం బిలారా అదనపు సివిల్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరిచి ట్రాన్సిట్‌ వారెంట్‌ పొందారు. కైకలూరుకు తీసుకువచ్చి సెప్టెంబర్‌ 9న జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ ఎదుట రిమాండ్‌ నిమిత్తం హాజరుపరిచారు.

నిందితుడిని ఇతర రాష్ట్రంలో గుర్తించి అరెస్ట్‌ చేయడంలో చాకచక్యం, సమన్వయం కనబరిచిన ఎస్‌ఐ రామచంద్రరావు, పీసీలు మహేష్‌, రవీంద్రబాబులను జిల్లా ఎస్పీ ప్రశాంత్ శివ కిషోర్, ఎస్‌డీపీవో శ్రావణ్ కుమార్, సీఐ రవికుమార్ లు అభినందించారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం