📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Mangalagiri : పాడైన మాంసం.. అపరిశుభ్ర వంటగది.. ఐపీఎం డైరెక్టర్‌ అరుణ్‌బాబు స్వయంగా తనిఖీ


  • ఓ ప్రైవేటు రెస్టారెంట్‌ వంటగది తాత్కాలిక మూసివేత..
  • 6 కిలోల పాడైన ఆహారం ధ్వంసం..

గుంటూరు జిల్లా : మంగళగిరి : స్వచ్ఛవార్త :

ఫ్రీజర్‌లో పాడైన చికెన్‌, మటన్‌, తందూరీ చికెన్‌, కబాబ్‌లు నిల్వ ఉంచడం.. మాంసం, చికెన్‌ రక్తపు మరకలతో వంటగది అపరిశుభ్రంగా ఉండటం వంటి తీవ్ర లోపాలు బయటపడటంతో మంగళగిరి కాజా టోల్‌ప్లాజా సమీపంలోని ఒక మల్టీ క్యూజీన్‌ ఫ్యామిలీ రెస్టారెంట్‌ వంటగదిని అధికారులు తాత్కాలికంగా మూసి వేయించారు. ఐపీఎం (ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్) డైరెక్టర్‌ అరుణ్‌బాబు బుధవారం సాయంత్రం స్వయంగా తనిఖీ చేసి పరిస్థితులను పరిశీలించారు. 

ఆయనతో పాటు సహాయ ఆహార నియంత్రణ అధికారి ఎన్‌.పూర్ణచంద్రరావు, ఆహార భద్రత అధికారులు బి.నరసింహుడు, ఎన్‌.వెంకటేశ్వర్లు తనిఖీలో పాల్గొన్నారు. అనంతరం వంటగది కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తూ అధికారులు నోటీసు జారీ చేశారు. ఈ మేరకు అరుణ్ బాబు బుధవారం రాత్రి ఓ ప్రకటన జారీ చేశారు 

తనిఖీలో ఫ్రీజర్‌లో పాడైన ముడి బోన్‌లెస్‌ చికెన్‌ 500 గ్రాములు, వండిన చికెన్‌ కూర 500 గ్రాములు, వండిన మటన్‌ 500 గ్రాములు, తందూరీ చికెన్‌ 2.5 కిలోలు, చికెన్‌ తంగ్డీ కబాబ్‌ 1.5 కిలోలు, ఆటా పిండి 500 గ్రాములు ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 6 కిలోల ఆహార పదార్థాలను అక్కడికక్కడే ధ్వంసం చేశారు. తనిఖీలో గడువు ముగిసిన స్కిమ్డ్‌ మిల్క్‌ డెయిరీ వైటెనర్‌ పౌడర్‌ 3 కిలోలు, కంపౌండెడ్‌ ఇంగువ పొడి 600 గ్రాములు, పన్నీర్‌ చీజ్‌ అనలాగ్‌ 1 కిలో కూడా గుర్తించారు. సంబంధిత పదార్థాలను స్వాధీనం చేసుకుని తదుపరి పరీక్షలు, పరిశీలనకు చర్యలు చేపట్టారు. 

ఆహార నాణ్యతను నిర్ధారించేందుకు మొత్తం 13 నమూనాలు సేకరించారు. ఇందులో 3 చట్టపరమైన, 10 పర్యవేక్షణ నమూనాలు ఉన్నాయి. బెల్లం, కారం పొడి, ధనియాలతో పాటు శనగపప్పు, మామిడికాయ ఊరగాయ, కందిపప్పు, మస్టర్డ్‌ సాస్‌, స్వీట్‌ చిల్లీ సాస్‌, చిల్లీ పొడి, మటన్‌ మసాలా, పన్నీర్‌ చీజ్‌ అనలాగ్‌, చికెన్‌ మసాలా తదితర నమూనాలను పరీక్షలకు పంపారు. 

ఫ్రీజర్‌లో మాంసం, చికెన్‌ రక్తపు మరకలు, గోడలపై నూనె, పొగ మరకలు, వ్యర్థాలతో మురుగునీటి కాలువలు మూసుకుపోవడం, వంటగదిలో చెత్త పేరుకుపోవడం, ఆహార తయారీలో ఉపయోగించకూడని రంగుల పదార్థాలు, లేబుళ్లు లేని మసాలా పొడులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 

లోపాలను వెంటనే సరిచేయాలని, పరిశుభ్రత, ఆహార నిల్వ, వ్యర్థాల తొలగింపు తదితర అంశాల్లో నిబంధనలు పాటించాలని యాజమాన్యాన్ని ఆదేశించారు. లోపాలను సరిచేసినట్లు నివేదిక సమర్పించే వరకు వంటగది కార్యకలాపాలు నిలిపివేయాలని స్పష్టం చేశారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం