Mogalthuru : సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసిన అండ్రాజు శ్రీనివాసరావు
పశ్చిమగోదావరి జిల్లా : మొగల్తూరు : స్వచ్ఛవార్త :
నరసాపురం నియోజకవర్గం మొగల్తూరులో మంగళవారం నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్, కైకలూరు నియోజకవర్గానికి చెందిన అండ్రాజు శ్రీనివాసరావు ముఖ్యమంత్రిని హెలిప్యాడ్ వద్ద మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడారు.
ప్రజా సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలవడం ఆనందంగా ఉందని శ్రీనివాసరావు తెలిపారు. ఆయన నాయకత్వంలో ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు మరింత ముందుకు సాగి ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని అండ్రాజు శ్రీను ఆకాంక్షించారు.
