Mudinepalli : అమరావతి అభివృద్ధికి జేపీఎఫ్ ఫౌండర్ దయానందం చేయూత.. రూ.3,116 విరాళం
ముదినేపల్లి / విజయవాడ : స్వచ్ఛవార్త :
ప్రజా రాజధాని అమరావతి అభివృద్ధికి జేపీఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు, దయానంద ట్రస్ట్ అధ్యక్షుడు బండెల దయానందం రూ.3,116 విరాళాన్ని అందించారు. ఏపీసీఆర్‌డీఏ క్యూఆర్ కోడ్ ద్వారా ఈ మొత్తాన్ని అమరావతి అభివృద్ధికి పంపించారు.
ఈ విషయాన్ని అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి తండ్రి డాక్టర్ అంబుల మనోజ్ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
ఈ సందర్భంగా డాక్టర్ మనోజ్ మాట్లాడుతూ..
అమరావతి అభివృద్ధికి వివిధ వర్గాల నుంచి అందుతున్న సహకారం అభినందనీయమన్నారు. రాజధాని అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కీలకమని పేర్కొన్నారు.
అమరావతి అభివృద్ధికి తమవంతుగా సహకరించేందుకు మరింత మంది ముందుకు రావాలని ఆయన కోరారు. తమకు సాధ్యమైన మేరకు విరాళాలు అందిస్తూ రాజధాని అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
అమరావతి అభివృద్ధికి రూ.3,116 విరాళం అందించిన బందెల దయానందానికి డాక్టర్ మనోజ్ అభినందనలు తెలిపారు.
