📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Mudinepalli : అమరావతి అభివృద్ధికై అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి ఇంట వరాహ సుదర్శన మహాయజ్ఞం


ఏలూరు జిల్లా : ముదినేపల్లి : స్వచ్ఛవార్త :

ఆంధ్రుల కలల ప్రజా రాజధాని అమరావతి నిర్మాణం వేగంగా, విజయవంతంగా సాగాలని ఆకాంక్షిస్తూ "శ్రీ భూ వరాహ సుదర్శన మహాయజ్ఞాన్ని" నిర్వహించనున్నట్లు వైద్య విద్యార్థిని, అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.వరాహ జయంతి సందర్భంగా ఈ నెల 13న ఆదివారం ఉదయం 9 గంటలకు ముదినేపల్లిలోని తన తండ్రి డాక్టర్ మనోజ్ ఆసుపత్రి ఆవరణలో ఈ యజ్ఞాన్ని నిర్వహించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. అమరావతి రాజధాని నిర్మాణం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపడుతున్న సంకల్పం నిరాటంకంగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ ఈ యజ్ఞాన్ని నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.

ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని యజ్ఞాన్ని విజయవంతం చేయాలని అంబుల వైష్ణవి కోరారు. “అమరావతికి జీవం పోద్దాం.. రూ.116 సాయం చేద్దాం!” అనే నినాదంతో ప్రతి ఒక్కరూ తమవంతు సహకారం అందించాలని ఈ సందర్భంగా వైష్ణవి పిలుపునిచ్చారు. సీఆర్డీఏ ఖాతా నంబర్ 034310100118883కు గాని, క్యూఆర్ కోడ్ ద్వారా గాని రూ.116 సాయం చేయవచ్చని తెలిపారు. అమరావతి అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అంబుల వైష్ణవి ఈ సందర్భంగా కోరారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం