📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Mudinepalli : అమరావతి అభివృద్ధి సంకల్పంతో అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి ఇంట భూ వరాహ సుదర్శన మహాయజ్ఞం

ఏలూరు జిల్లా : ముదినేపల్లి : స్వచ్ఛవార్త :

అమరావతి రాజధాని అభివృద్ధి వేగవంతంగా సాగాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ శ్రీ భూ వరాహస్వామి జయంతి సందర్భంగా ముదినేపల్లిలో శ్రీ భూ వరాహ సుదర్శన మహాయజ్ఞం నిర్వహించారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో మండలంలోని పురోహితులు, భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు, యజ్ఞ కార్యక్రమాలను నిర్వహించారు.ఈ సందర్భంగా అమరావతి అంబాసిడర్‌, వైద్య విద్యార్థిని అంబుల వైష్ణవి తండ్రి, ప్రముఖ వైద్యుడు డాక్టర్ అంబుల మనోజ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అంబుల వైష్ణవి సంకల్పానికి అనుగుణంగా అమరావతి రాజధాని నిర్మాణం త్వరితగతిన పూర్తయి అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ మహాయజ్ఞాన్ని నిర్వహించినట్లు తెలిపారు. అమరావతి అభివృద్ధి కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రజలందరూ భాగస్వాములై తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు.

ప్రతి ఇంటి నుంచి రూ.116 సాయం :

అమరావతి నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుతూ ప్రతి ఇంటి నుంచి రూ.116 చొప్పున విరాళంగా అందించాలని డాక్టర్ మనోజ్ పిలుపునిచ్చారు. ప్రజలంతా చేయి చేయి కలిపి అమరావతి నిర్మాణానికి అండగా నిలవాలని అన్నారు. రాబోయే రోజుల్లో మన పిల్లలు అమరావతిలోనే విద్యాభ్యాసం చేసి, ఇక్కడే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందేలా రాజధాని అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

ఇతర రాష్ట్రాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, ఎన్నారైలు అమరావతిలో పెట్టుబడులు పెట్టి రాజధాని ప్రగతికి తమ వంతు సహకారం అందించాలని కోరారు. అమరావతి అభివృద్ధి, రాష్ట్ర ప్రగతి, ప్రజల సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ నిర్వహించిన ఈ మహాయజ్ఞానికి ప్రజల భాగస్వామ్యం, భగవంతుని ఆశీస్సులు కొనసాగాలని డాక్టర్ మనోజ్ ఆకాంక్షించారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం