📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Pedana : 19న జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలి – జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ

కృష్ణాజిల్లా : పెడన : స్వచ్ఛవార్త :

నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈనెల 19న పెడనలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శనివారం ఉదయం 9 గంటలకు పెడనలోని శ్రీ బొడ్డు నాగయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

జాబ్ మేళాలో టాటా ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఎన్‌ఎస్ ఇన్‌స్ట్రుమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ముత్తూట్ మనీ లిమిటెడ్, వీ.ఎన్.ఆర్. జ్యూవెలరీ మాన్యుఫాక్చర్స్, బంధన్ బ్యాంక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, అపోలో ఫార్మసీ, వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎల్విన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, అడెక్కో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, యూఎన్‌ఓ మిండా లిమిటెడ్, పేటీఎం సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ తదితర ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి డాక్టర్ పి. నరేష్ కుమార్ తెలిపారు. 570కిపైగా వివిధ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు చెప్పారు.

టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసిన 18 నుంచి 35 సంవత్సరాల లోపు యువత ఈ ఉద్యోగాలకు అర్హులని తెలిపారు. ఎంపికైన వారికి మంచి వేతనంతో పాటు ఇతర సౌకర్యాలతో కూడిన ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు.

ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ముందుగా naipunyam.ap.gov.in వెబ్‌సైట్‌లో తమ పూర్తి వివరాలతో తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలని తెలిపారు. జాబ్ మేళాకు రెజ్యూమ్ లేదా బయోడేటాతో పాటు ఆధార్, ఆధార్‌కు లింక్ అయిన ఫోన్ నంబర్, పాన్ కార్డు, విద్యార్హత సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలతో హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 99664 89796, 63006 18985 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం