📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Polavaram : వైసీపీ నేతల అక్రమాలపై ఆధారాలతో టీడీపీ ఎదురుదాడి.. అశోక్ సంచలన ఆరోపణలు

మీడియాతో మాట్లాడుతున్న మండల అధ్యక్షుడు అశోక్

ఏలూరు జిల్లా : పోలవరం : స్వచ్ఛవార్త :

వైసీపీ మండల నాయకులు అవినీతి అక్రమాల్లో ఆరితేరి సామాన్యులను జలగాల్లా పీక్కు తిన్నారని వేలేరుపాడు టీడీపీ మండల అధ్యక్షుడు అమర వరపు అశోక్ ధ్వజమెత్తారు. వేలేరుపాడు మండల వైసీపీ నాయకుల అక్రమాల గురించి పూర్తి ఆధారాలతో సోమవారం టీడీపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు.

ఇసుక,మట్టి తోలకాలు, రేషన్ బియ్యం,నూనె ప్యాకెట్ల పంపిణీ లో అక్రమాలకు పాల్పడటమే కాక పోలవరం భూసేకరణ, అనేక మంది ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలలో 50 శాతం కమీషన్ లతో భారీ అవినీతి కి పాల్పడి కోట్లు అక్రమ ఆస్తులు కూడ పెట్టారని ఆరోపించారు. గిరిజనులను అక్రమ మద్యం కేసులలో ఇరికించి పబ్బం గడుపుకున్నారని,1/70 చట్టం పేరుతో నిర్మించిన ఇళ్ళు కూల్చేందుకు కుట్ర పన్నారని ద్వజమెత్తారు.

2022 వరదల సమయంలో తప్పుడు వరద సహాయం లెక్కలను అప్పటి వైసీపీ ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లి 2 కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డారని వివరించారు. 2024 ఎన్నికల ఊరేగింపు లో తమ పై రాళ్లు,మద్యం సీసాలతో దాడి చేయించి శాంతి భద్రతలకు విఘాతం కల్గించి తమ పైనే తప్పుడు కేసులు పెట్టారని అన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ లో చేరిన ఘనత మీదని వైసీపీ నాయకును ఉద్దేశించి విమర్శించారు.

మాజీ టీడీపీ మండల అధ్యక్షుడు ను అడ్డం పెట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తూ భూ సేకరణ లో అక్రమాలు చేస్తున్నామని చెప్పడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. ప్రస్తుతం జనసేన పార్టీలోని కొందరిని మచ్చిక చేసుకుని చాటు మాటు రాజకీయం ప్రారంభించారని అన్నారు.నకిలీ మిర్చి విత్తనాల వలన మోస పోయిన రైతులకు నష్టపరిహారం తామే అందించా మని చెప్పడం వారి సిగ్గుచేటు కు నిదర్శనమని తెలిపారు.పోలవరం భూ సేకర లో భాగంగా రైతుల ఇష్ట ప్రకార మే ప్రభుత్వం రైతుల వద్ద భూములు కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు. 

వైసీపీ మరో నాయకుడు ఒకరు 2017 భూసేకరణ మొదలు ఇప్పటి వరకు భారీ అవినీతి కి పాల్పడి నిర్వాసితుల వద్ద కమిషన్లు దండు కున్నారని ఆరోపించారు.ఈ నాయకుడు గ్రామ పంచాయతీ,పడవ రేవు నిర్వహణ లో భారీగా వసూళ్లకు పాల్పడి,చని పోయిన పోలవరం నిర్వాసితుల పేర్లు ఆర్ అండ్ ఆర్ జాబితా లో తొలగించిన ఘనుడని వారి వద్ద ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇప్పిస్తామని భారీగా డబ్బులు వసూలు చేసి హైదరాబాద్ లో కోటి రూపాయల ఇళ్ళు నిర్మించు కున్నాడని ఆరోపించారు.

సమావేశంలో కూటమి నాయకులు కొమ్మన వెంకటేశ్వర రావు,నూప శ్రీరాములు, మేచినేని సంజయ్, బేతి శ్రీను, కోటిపల్లి ముత్యాలరావు, రామకృష్ణ, సంతోష్,బీరం అంజి, అమరవరపు వెంకన్న,కొత్తపల్లి బాబులు, గోపు పెంటారావు, చిట్టి పోతుల పోసి తదితరులంతా ఉన్నారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం