📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Prattipadu : డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసుల్లో కోర్టు కొరడా.. ఐదుగురికి జైలు, రూ.లక్ష జరిమానా

కాకినాడ జిల్లా : ప్రత్తిపాడు క్రైమ్ : స్వచ్ఛవార్త :

రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు చేపట్టిన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీల్లో పట్టుబడిన వారికి కోర్టు శిక్షలు విధించింది.  ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్తిపాడు సర్కిల్‌ పరిధిలో పోలీసులు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో నమోదైన కేసులపై మంగళవారం ప్రత్తిపాడు జేఎఫ్‌సీఎం కోర్టులో విచారణ జరిగింది.

ప్రత్తిపాడు, ఏలేశ్వరం, అన్నవరం పోలీస్‌ స్టేషన్ల పరిధిలో నమోదైన మొత్తం 15 డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసుల్లో రూ.1 లక్ష జరిమానా విధించగా, ఐదుగురికి జైలు శిక్ష పడింది.

ప్రత్తిపాడు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నమోదైన మూడు కేసుల్లో ఇద్దరికి రూ.10 వేల చొప్పున జరిమానా, మరొకరికి మూడు రోజుల జైలు శిక్ష విధించారు. ఏలేశ్వరం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నమోదైన నాలుగు కేసుల్లో ఇద్దరికి రూ.10 వేల చొప్పున జరిమానా, మరో ఇద్దరికి రెండేసి రోజుల జైలు శిక్ష విధించారు.

అన్నవరం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నమోదైన ఎనిమిది కేసుల్లో ఆరుగురికి రూ.10 వేల చొప్పున జరిమానా విధించగా, మరో ఇద్దరికి వరుసగా రెండు, మూడు రోజుల జైలు శిక్ష విధించారు.

మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాల ముప్పు పెరుగుతుందని పోలీసులు పేర్కొన్నారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌తో పాటు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపైనా చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని ప్రత్తిపాడు సీఐ సూర్య అప్పారావు హెచ్చరించారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం