📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Tadepalligudem : చెత్త నిర్వహణపై విద్యార్థులకు అవగాహన.. 4 బిన్స్ విధానంతో వ్యర్థాలకు చెక్

పశ్చిమగోదావరి జిల్లా : తాడేపల్లిగూడెం : స్వచ్ఛవార్త : 

స్వచ్ఛత హి సేవ–2026 కార్యక్రమంలో భాగంగా తాడేపల్లిగూడెం పురపాలక సంఘం ఆధ్వర్యంలో గురువారం జెడ్పీ హైస్కూల్‌లో విద్యార్థులకు వ్యర్థాల వేర్పాటుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా స్పెషల్‌ గ్రేడ్‌ కమిషనర్‌ ఎం. యేసుబాబు మాట్లాడుతూ ఇంటి నుంచే చెత్తను తడి, పొడి, ప్రమాదకర, శానిటరీ వ్యర్థాలుగా వేరు చేసి సంబంధిత బిన్లలో వేయడం అలవాటు చేసుకోవాలని సూచించారు.వ్యర్థాలను వేర్వేరుగా సేకరించడం ద్వారా పరిసరాల పరిశుభ్రతను కాపాడటంతో పాటు చెత్త నిర్వహణ సులభతరం అవుతుందని వివరించారు. అనంతరం విద్యార్థులతో స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయించారు.కార్యక్రమంలో మున్సిపల్‌ ఇంజనీర్‌ వై. వెంకటరమణ, ఏసీపీ జి. సీతారాం, మున్సిపల్‌ మేనేజర్‌ పి. ప్రసాదరావు, ఇతర అధికారులు, ఉపాధ్యాయులు, మున్సిపల్‌ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం