Tadepalligudem : వినాయక నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. డీఎస్పీ రవిచంద్ర పరిశీలన
ఏలూరు జిల్లా : తాడేపల్లిగూడెం : స్వచ్ఛవార్త :
వినాయక చవితి నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా తాడేపల్లిగూడెం పట్టణ పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఆదివారం జువ్వలపాలెం రోడ్డులో నిమజ్జనం జరిగే ప్రాంతాన్ని సబ్‌డివిజనల్ పోలీసు అధికారి రవిచంద్ర, సీఐలు ఆదిప్రసాద్, శ్రీనివాసులు, ఎస్‌ఐలు శ్రీనివాస్, వెంకటరమణ తదితరులతో కలిసి పరిశీలించారు.
నిమజ్జనం సమయంలో భద్రతా చర్యలు, ప్రజల రాకపోకలు సజావుగా సాగేలా తీసుకోవాల్సిన చర్యలు, అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా చేపట్టాల్సిన జాగ్రత్తలపై ఎస్‌డీపీవో పోలీసు అధికారులకు సూచనలు చేశారు. వినాయక చవితి నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా సిబ్బంది నిర్వహించాల్సిన విధులు, బందోబస్తు ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు.
