Bhimavaram : ఈనెల 11 నుంచి శ్రీ మావుళ్ళమ్మ ఆలయంలో దసరా మహాత్సవాలు ప్రారంభం
ఉత్సవాల బుక్ లెట్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే అంజిబాబు
ప.గో జిల్లా : భీమవరం (స్వచ్ఛవార్త) :
భీమవరం ఇలవేల్పు శ్రీమావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో ఈనెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీదేవి శరన్నవరాత్రుల మహోత్సవాలు జరుగుతాయని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. బుధవారం భీమవరం ఎమ్మెల్యే నివాసం వద్ద దసరా ఉత్సవాల బ్రోచర్ ను ఆవిష్కరించారు. అమ్మవారికి ఈనెల 11 నుంచి 20 వ తేది వరకు ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేస్తారని, భక్తులందరూ అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందాలన్నారు.
ఆలయ ఈవో బుద్ధ మహాలక్ష్మి నగేష్ మాట్లాడుతూ..
10 రోజులుపాటు అమ్మవారి ఆలయంలో దసరా మహోత్సవాలు జరుగుతాయని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక సౌకర్యాలను క్యూ లైన్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈనెల 22న అన్న సమారాధన జరుగుతుందన్నారు.
ఆలయ చైర్మన్ బోండాడ నాగ భూషణం, ప్రధానార్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ, పాలకవర్గ సభ్యులు రామాయణం శ్రీనివాసరావు అతికాల ఆంజనేయప్రసాద్ ఉడిసి మీనాక్షి మిర్తిపాటి గుణ్ణేశ్వరావు మరియు స్థానిక నాయకులు కారంపూడి నాగేశ్వరావు గుసిడీ సూరిబాబు, మలువలస రాము తదితరులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
