Bhimavaram : బాలా త్రిపురసుందరీ దేవి గా మావుళ్లమ్మ దర్శనం.. అమ్మవారి స్వర్ణవస్త్రం ప్రాజెక్టుకు 16 గ్రాముల బంగారం విరాళం
ప.గో జిల్లా : భీమవరం ( స్వచ్ఛవార్త) :
దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భీమవరం పట్టణ ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారు బాలా త్రిపురసుందరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారి తీర్థ ప్రసాదాలను ఆలయ సిబ్బంది భక్తులకు అందించారు. శ్రీ మావుళ్ళమ్మ సంపూర్ణ స్వర్ణవస్త్రం ప్రాజెక్టుకు హైదరాబాద్‌కు చెందిన కలిదిండి అజయ్ బాబు, జమి వర్ధని దంపతులు సుమారు రూ.2.20 లక్షల విలువైన 16 గ్రాముల బంగారాన్ని సమర్పించినట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ ఒక ప్రకటనలో తెలిపారు..
దాత దంపతులకు ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనం అందించారు. అనంతరం ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్, ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు అతికెల ఆంజనేయ ప్రసాద్, గుసిడి నాగశిరీష, కారెంపూడి ఆదిలక్ష్మి, మిర్తిపాటి గున్నేశ్వరరావు దాత దంపతులకు శేషవస్త్రం, అమ్మవారి ప్రసాదం, ఫొటోను అందజేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు.
