📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Bhimavaram : భీమవరంలో భారీ దొంగతనాల కేసు 24 గంటల్లో ఛేదన.. సుమారు రూ.1.08 కోట్ల విలువైన బంగారం, వెండి, నగదు స్వాధీనం

  • శ్రీనిధి అపార్ట్‌మెంట్‌లో వరుస చోరీలు.. నిందితుడు అరెస్ట్‌...

ప.గో జిల్లా : భీమవరం (స్వచ్ఛవార్త) :

పట్టణంలోని స్థానిక శ్రీనిధి గ్రాండ్ అపార్ట్‌మెంట్‌లో జరిగిన వరుస దొంగతనాల కేసును భీమవరం వన్‌టౌన్ పోలీసులు 24 గంటల్లో ఛేదించి నిందితుడిని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి మొత్తం రూ.1,08,80,455 విలువైన బంగారం, వెండి ఆభరణాలు, నగదును స్వాధీనం చేసుకున్నట్లు పశ్చిమగోదావరి జిల్లా అదనపు ఎస్పీ డి. విశ్వనాథ్ శనివారం భీమవరం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు.

ఒకే అపార్ట్‌మెంట్‌లో ఏడు చోరీ కేసులు :

పోలీసుల వివరాల ప్రకారం.. భీమవరం పట్టణం నరసయ్య అగ్రహారంలోని శ్రీనిధి గ్రాండ్ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న శీలమంతుల కనక మహాలక్ష్మి ఫిర్యాదు మేరకు అక్టోబర్ 22న వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 232/2026, బీఎన్‌ఎస్‌ సెక్షన్లు 331(4), 305(a) కింద కేసు నమోదు చేశారు. ఇదే అపార్ట్‌మెంట్‌లోని వివిధ ఫ్లాట్లను లక్ష్యంగా చేసుకుని నిందితుడు వరుస దొంగతనాలకు పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ ఘటనలకు సంబంధించి మొత్తం ఏడు కేసులు నమోదయ్యాయి.

ఇళ్లలో ఎవరూ లేని సమయాన్ని ఆసరాగా చేసుకున్న నిందితుడు తలుపులు, బీరువాల తాళాలు పగులగొట్టి లోపల ఉన్న బంగారం, వెండి ఆభరణాలు, నగదును అపహరించినట్లు పోలీసులు గుర్తించారు.

సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడి గుర్తింపు :

జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి ఆదేశాల మేరకు, అదనపు ఎస్పీ డి. విశ్వనాథ్, సబ్‌ డివిజనల్ పోలీస్ అధికారి రఘువీర్ విష్ణు పర్యవేక్షణలో దర్యాప్తును వేగవంతం చేశారు. వన్‌టౌన్ సీఐ రమేష్ నేతృత్వంలోని క్రైమ్‌ టీమ్‌ ఘటనా స్థలాలను పరిశీలించి, సీసీ కెమెరాల ఫుటేజీలను క్షుణ్ణంగా విశ్లేషించింది. అనుమానితుడి కదలికలపై నిఘా ఉంచిన పోలీసులు విశ్వసనీయ సమాచారం ఆధారంగా అక్టోబర్ 23న సాయంత్రం 5 గంటల సమయంలో భీమవరం రైల్వే జంక్షన్‌ స్టేషన్‌ పరిధిలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని శ్రీనిధి అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌ నంబర్‌ 303లో నివాసం ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు.

పోలీసు బృందానికి అదనపు ఎస్పీ అభినందనలు :

తక్కువ సమయంలో కేసును ఛేదించి భారీ మొత్తంలో చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్న వన్‌టౌన్‌ సీఐ రమేష్‌, ఎస్‌ఐలు కె. చంద్రశేఖర్‌, కె. శ్రీనివాస్‌, క్రైమ్‌ పార్టీ హెడ్‌ కానిస్టేబుల్‌ యెహోషువా, కానిస్టేబుళ్లు రామకృష్ణ, శ్రీనివాస్‌తో పాటు సహాయక సిబ్బంది రైటర్‌ నాగరాజు, కానిస్టేబుళ్లు శ్రీను, రాజేష్‌, నాగేశ్వరరావు, జార్జ్‌, కృష్ణప్రసాద్‌, రాములను అదనపు ఎస్పీ డి. విశ్వనాథ్‌ ప్రత్యేకంగా అభినందించారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kaikaluru Rural Circle : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కైకలూరు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌

Kalidindi : కలిదిండిలో ఎన్డీఏ మండల సమావేశం.. కూటమిలోకి పలువురు వైకాపా నేతలు

Eluru : జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు : జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Mandavalli : ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అధికారుల సూచనలు

Kaikaluru : సాంకేతిక ఆధారాలతో కుట్రపూరిత నేరాన్ని ఛేదించిన కలిదిండి పోలీసులు

Kaikaluru Town : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Kaikaluru : ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలి : జక్కుల విజయ్ కుమార్

Kaikaluru : వీరాబత్తిన సుధకు పలువురు టీడీపీ నేతల పరామర్శ

Mudinepalli : ముదినేపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ప్రకటన.. జడ్పీటీసీగా బొర్రా చలమయ్య.. ఎంపీపీగా కోటప్రోలు నాగరత్నకుమారి

Gudlavalleru : శ్రీ కొండలమ్మ అమ్మవారి మహా అన్నసమారాధనకు 250 కిలోల బియ్యం విరాళం