Bhimavaram : పల్లె పండగ 3.0లో అభివృద్ధి పనులకు శ్రీకారం : కేఎన్నార్
పశ్చిమగోదావరి జిల్లా : భీమవరం (స్వచ్ఛవార్త ) :
పల్లె పండగ 3.0 కార్యక్రమంలో భాగంగా భీమవరం మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు పాల్గొని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న పనుల్లో భాగంగా ఈ కార్యక్రమాలు నిర్వహించారు.
గ్రామాల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టడం ద్వారా ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయని కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు తెలిపారు. పల్లె పండగ 3.0 ద్వారా గ్రామాల్లో అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కే ఎన్ ఆర్ మాట్లాడుతూ..
గ్రామాల అభివృద్ధికి చేపట్టే ప్రతి కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యం అవసరమన్నారు. కార్యక్రమాల్లో స్థానిక టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.
