Bhimavaram : శ్రీ మావుళ్లమ్మ కానుకల హుండీలకు రూ.33.27 లక్షల ఆదాయం
పశ్చిమగోదావరి జిల్లా : భీమవరం (స్వచ్ఛవార్త) :
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానంలో 40 రోజుల కాలానికి కానుకల హుండీల ద్వారా రూ.33,27,757 నగదు ఆదాయం లభించినట్లు దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన ఆధ్వర్యంలో బుధవారం భక్తుల కానుకల హుండీలను తెరిచి లెక్కించారు
సింగరాయపాలెం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ ఆర్. గంగా శ్రీదేవి పర్యవేక్షణలో కానుకల హుండీల లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు.
భక్తులు సమర్పించిన కానుకల్లో 35 గ్రాముల 200 మిల్లీగ్రాముల బంగారం, 144 గ్రాముల వెండి లభించాయి. అలాగే అమెరికా 50 డాలర్లు, సింగపూర్ 2 డాలర్లు, మలేషియా 5 రింగిట్లు, యూఏఈ 10 దిర్హాముల విదేశీ కరెన్సీ ఉన్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ, ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్, ఉదీశి మీనాక్షి, అతికెల ఆంజనేయ ప్రసాద్, అరసవల్లి సుబ్రహ్మణ్యం, మిర్తిపాటి గుణేశ్వరరావు, యండా సత్యవతి, పాపోలు ఏడుకొండలు, దేవదాయ ధర్మదాయ శాఖ భీమవరం తనిఖీదారు పి.ఎస్. సాయికుమారి, భీమవరం యూనియన్ బ్యాంకు సిబ్బంది, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.